అనుష్క “నిశ్శబ్దం” ఫస్ట్ లుక్ పోస్టర్- 301 మరియు కీ ఫజిల్.

Published on Jul 20, 2019 5:46 pm IST

అనుష్క శెట్టి,మాధవన్ ప్రధాన పాత్రలలో దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సైలెన్స్”. దీనిని తెలుగులో “నిశ్శబ్దం” గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,కోనా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై కోనా వెంకట్,టి జి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా కొద్దిసేపటి ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.

వివిధ రంగులు పులుముకున్న రెండు చేతులు 301 అనే సంఖ్యను సింబాలిక్ గా చూపిస్తుంటే, ఆ చేతులలో ఒకచేతికి ఒక తాళం ఉన్న బ్రేస్ లెట్ ఉంది. బ్యాగ్రౌండ్ లో పాడుబడిన పెద్ద ద్వారం కనపడుతుంది. మొత్తానికి ఆసక్తికరంగా నిశబ్దం ఫస్ట్ లుక్ పోస్టర్ ఓ పజిల్ లా ఉంది. అంజలి,షాలిని పాండే వంటి తారలు ముఖ్యపాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :