“సైలెంట్’ గా అమెరికా చెక్కేయనున్న స్వీటీ అనుష్క

Published on May 16, 2019 9:24 am IST

స్వీటీ అనుష్క ముఖానికి రంగు వేసుకొని చాలాకాలమైంది. ఆమె 2018లో విడుదలైన ‘భాగమతి’ తరువాత ఎటువంటి మూవీ కి సైన్ చేయలేదు. మళ్లి తెరపై ఆమెను ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న అనుష్క అభిమానులకు ఓ స్వీట్ న్యూస్. అనుష్క ఎట్టకేలకు ‘సైలెంట్’ అనే మూవీలో నటించడానికి అంగీకరించారు. తమిళ్ హీరో మాధవన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ లో అంజలి మరియు షాలినీ పాండే ప్రధాన పాత్రలలో నటించనున్నారు.కథరీత్యా ఈ చిత్రం అధిక భాగం అమెరికాలో చిత్రీకరించనున్నారు. కనుక అనుష్క తో పాటు చిత్ర యూనిట్ త్వరలో అమెరికా వెళ్లనున్నారని సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు,తమిళ్ మరియు హిందీ భాషలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎప్పుడో 2006 వచ్చిన ‘రెండు’ మూవీ తరువాత అనుష్క,మాధవన్ ఇన్నేళ్లకు కలిసినటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More