మే 24 నుండి మొదలుపెట్టనున్న అనుష్క !

Published on May 18, 2019 1:00 am IST

స్టార్ హీరోయిన్ అనుష్క ఈమధ్య సినిమాల కౌంట్ బాగా తగ్గించారు. సెలెక్టివ్‌గా సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నారు. చివరిగా ‘భాగమతి’ సినిమాలో కనిపించిన ఈమె లాంగ్ గ్యాప్ తరవాత ‘సైలెన్స్’ అనే సినిమాకి సైన్ చేశారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఎక్కువ భాగం కథ అమెరికా నేపథ్యంలో ఉండటం వలన చిత్రీకరణ అక్కడే ఎక్కువగా జరగనుంది.

మే 24వ తేదీన నుండి రెగ్యులర్ షూట్ మొదలవుతుంది. ఇందులో అనుష్క ఎన్నారై బిజినెస్ఉమెన్ పాత్రలో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో షాలిని పాండే, అంజలి, సుబ్బరాజ్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మడిసెన్ కీలక పాత్రలు పోషించనున్నారు. అనుష్క బాగా బరువు తగ్గిన తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొని ఉంది.

సంబంధిత సమాచారం :

More