వదిలిపోయి ఏడేళ్లవుతున్న అతన్ని మర్చిపోని అనుష్క

Published on May 18, 2019 3:17 pm IST

ఇండస్ట్రీలో అందరిచేత ప్రేమించబడే వ్యక్తులలో స్వీటీ అనుష్క ఒకరు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్త్వం, అందరినీ గౌరవించడం, వివాదాలకు దూరంగా ఉండటం అనుష్క కి ఉన్న గొప్ప లక్షణాలు. అలాంటి అనుష్క మళ్ళీ అందరి హృదయాలను కదిలించేలా ఓ ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం వరకు తన దగ్గర సహాయకుడిగా పనిచేసి హఠాన్మరణమ్ చెందిన రవి ని గుర్తుచేసుకుంటూ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు.

“మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో , వారు మనల్ని వదిలి వెళితే ఆ బాధ వర్ణనాతీతం . గత 14 సంవత్సరాలు చాలా ప్రయాణం సాగింది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఇక మీ జీవితంలో భాగం కాదు అని తెలిసినప్పుడు, వారి జ్ఞాపకాలు మనకి దూరమైనప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. నీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. చనిపోయిన తర్వాత ఎలాంటి జీవితం ఉంటుందనే విషయం నాకు తెలియదు. కాని నువ్వు ఎప్పుడు నా హృదయంలో నిలిచి ఉంటావు” అని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు అనుష్క.

బ్రతికున్న తల్లిదండ్రులను కూడా భారం అని వదిలేస్తున్న ఈ రోజుల్లో జీతానికి తన దగ్గర పనిచేసిన ఒక అసిస్టెంట్ ని జీవితాన్తమ్ గుర్తుపెట్టుకుంటానంటున్న అనుష్క ఎంత ఉన్నతమైన వ్యక్తితం కలవారో అర్థం అవుతుంది.

సంబంధిత సమాచారం :

More