గద్దలకొండ గణేష్ మొదటిరోజు వసూళ్ల దుమారం.

Published on Sep 21, 2019 12:24 pm IST

విడుదల ముందు నుండే టీజర్, ట్రైలర్స్ ద్వారా కలిగిన ప్రచారం విడుదల తరువాత పాజిటివ్ వర్డ్ అఫ్ మౌత్ కలిసి వరుణ్ నటించిన గద్దలకొండ గణేష్ మూవీ మొదటిరోజు తెలుగు రాష్ట్రాలలో వసూళ్లు దుమ్ముదులిపింది. మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం రెండు రాష్ట్రాలలో కలిపి 5.7కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ షేర్ రాబట్టింది. వరుణ్ గత చిత్రాలలో పోల్చుకుంటే ఈమొత్తం రికార్డు స్థాయి వసూళ్లతో సమానం.

కామెడీ అంశాలతో సాగే సీరియస్ గ్యాంగ్ స్టర్ స్టోరీలో గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ కేకపుట్టించారు. ఒక్క నైజాంలోనే గద్దలకొండ గణేష్ 1.7 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్రానికి పోటీగా విడుదలైన సూర్య నటించిన బందోబస్త్ చిత్రంకి మిక్స్డ్ టాక్ రావడంతో పాటు, డబ్బింగ్ చిత్రం కావడంతో గద్దలకొండ గణేష్ వసూళ్లకు బాగా కలిసొచ్చే అంశం. రాబోయే శని, ఆదివారాలలో గద్దలకొండ గణేష్ మూవీ వసూళ్లు మరింత ఆశాజనకంగా ఉండొచ్చు.

సంబంధిత సమాచారం :

X
More