సినిమా టికెట్ రేట్స్ పై కొత్త జీవో తెచ్చిన ఏపీ సర్కార్.!

Published on Jul 7, 2021 11:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ లాస్ట్ చిత్రం “వకీల్ సాబ్” సినిమాతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆకస్మికంగా రేట్లు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఆ టైం లో ఎంత రచ్చ లేపిందో తెలిసిందే. దీనితో తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతలలో కూడా కాస్త ఆందోళన నెలకొంది. దీనితో మళ్ళీ నిర్మాతల మండలి ఏపీ ప్రభుత్వం దృష్టికి యథావిధిగా టికెట్ రేట్లు పెంచడానికి అనుమతులు కావాలని కోరగా దీనిపై ఏపీ ప్రభుత్వం కొత్తగా జీవో ను ఇష్యూ చేసింది.

మరి దాని సమాచారం క్లుప్తంగా చూసుకున్నట్టయితే మళ్ళీ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని కానీ మళ్ళీ ఎప్పుడు టికెట్ రేట్స్ తగ్గించడం పెంచడం అనేది ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని సందర్భాల ఆధారంగా వాటిని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అని తెలియజేసింది. దీనితో రాబోయే రోజుల్లో బడా చిత్రాలకు కాస్త ఉపశమనం కలిగిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :