“బిచ్చగాడు 2” డైరెక్టర్ ని రివీల్ చేసిన మురుగదాస్.!

Published on Jul 24, 2021 12:28 pm IST


అటు తమిళ్ మరియు తెలుగులో కూడా డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన “బిచ్చగాడు” కూడా ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై దీనికి పెట్టిన డబ్బులకు ఎన్నో ఇంతలు లాభాలు తెచ్చిపెట్టింది ఈ చిత్రం. మన తెలుగులో అయితే మరో లెవెల్లో ఈ సినిమాని ఆదరించారు.

అయితే ఇంతటి అఖండ విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ “బిచ్చగాడు 2” కొన్నాళ్ల కితమే మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు అన్నది ప్రముఖ కోలీవుడ్ స్టార్ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ ఈరోజు రివీల్ చేయనున్నారని తెలుపగా ఇప్పుడు మురుగదాస్ ఆ దర్శకుడు ఎవరు అన్నది రివీల్ చేశారు.

మరి ఆ దర్శకుడు ఎవరో ఈ సినిమాలో హీరోగా సంగీత దర్శకునిగా వహిస్తున్న విజయ్ ఆంటోనినే దర్శకత్వ భాద్యతలు కూడా చేపట్టాడని తమ డైరెక్షన్ క్లాన్ లోకి స్వాగతం అని మురుగదాస్ రివీల్ చేశారు. మరి ఇప్పటి వారు హీరోగా సంగీత దర్శకునిగా తన టాలెంట్ కనబరిచిన విజయ్ డైరెక్టర్ ఈ భారీ హిట్ సీక్వెల్ ని ఎలా డీల్ చేసారో అన్నది ఆసక్తిగా మారింది. మరి అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదలకి ప్లాన్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం :