నటుడిగా ఎప్పుడొస్తారు.. సరదా సమాధానం ఇచ్చిన ఏఆర్‌ రెహమాన్‌..!

Published on Aug 15, 2021 3:00 am IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ‌మాన్ గురుంచి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన సంగీతంతో కోట్లాది హృదయాలను కొల్లగొట్టి ఆస్కార్ అవార్డ్ గ్రహితగా నిలిచాడు. ప్రస్తుతం ప‌లు సినిమాల‌కు సంగీతం అందిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అయితే సంగీత దర్శకులు అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపిస్తున్నప్పటికీ రెహమాన్‌ మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. ఈ క్రమంలో ఏఆర్ రెహ‌మాన్‌ని ఇటీవల సోషల్ మీడియాలో ఓ నెటిజన్ మీరు ఎప్పుడు నటుడిగా మారబోతున్నారని అడిగాడు.

అయితే ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రెహ‌మాన్ సరదా స‌మాధానం ఇచ్చాడు. గతంలో మాదిరిగా నేను ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా అని అన్నాడు. దీంతోరెహ‌మాన్ న‌టుడిగా క‌న‌ప‌డే ఛాన్స్ ఇప్పట్లో లేద‌ని ఆయన చెప్పిన సమాధానం ద్వారా తేలిపోయింది. ఇదిలా ఉంటే రెహ‌మాన్ ప్రస్తుతం త‌మిళంలో వెందు తనిద‌తు కాడు, పోన్నియ‌న్ సెల్వ‌న్, కోబ్రా, ఐలాన్ వంటి చిత్రాల‌కు సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

సంబంధిత సమాచారం :