మరో మాసివ్ మైల్ స్టోన్ అందుకున్న “అరబిక్ కుత్తు”.!

మరో మాసివ్ మైల్ స్టోన్ అందుకున్న “అరబిక్ కుత్తు”.!

Published on Jul 8, 2022 12:10 PM IST

arabic kuthu
రీసెంట్ గా సౌత్ ఇండియా మ్యూజిక్ దగ్గర సెన్సేషన్ గా నిలుస్తున్నా సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన ఆల్బమ్స్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటున్నాయో తెలిసిందే. ఇళయ దళపతి విజయ్ తో “బీస్ట్” అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ తో “విక్రమ్” చిత్రాలను చేసి రెండు బ్యాక్ టు బ్యాక్ భారీ ట్రీట్స్ ని అయితే అనిరుద్ అందించాడు. మరి వీటిలో బీస్ట్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ అరబిక్ కుత్తు అయితే సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అయ్యింది.

ఒక్క లిరికల్ గానే కాకుండా వీడియో సాంగ్ గా వచ్చి కూడా భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సాంగ్ రీసెంట్ గానే మాసివ్ రెస్పాన్స్ తో 100 మిలియన్ వ్యూస్ అందుకోగా ఇప్పుడు ఈ గ్యాప్ లో 150 మిలియన్ మార్క్ చేరుకొని సెన్సేషన్ ని నమోదు చేసింది. మొత్తానికి ఈ సాంగ్ మాత్రం మామూలు స్పీడ్ లో లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు