ఓటీటీ ప్రపంచం లో సంచలనం సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘మిర్జాపూర్'(Mirzapur) ఇప్పుడు వెండితెరపై అలరించడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, మేకర్స్ దీనిని ఫీచర్ ఫిల్మ్‌గా రూపొందించారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. సెప్టెంబర్ 4, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాలో ‘కాలీన్ భయ్యా’గా పంకజ్ త్రిపాఠి, ‘గుడ్డు పండిట్’గా అలీ ఫజల్ తమ ఐకానిక్ పాత్రల్లో తిరిగి కనిపించబోతున్నారు. అయితే అభిమానులకు అసలైన సర్ప్రైజ్ ఏమిటంటే.. మున్నా భయ్యా పాత్రలో దివ్యేందు శర్మ మళ్ళీ కనిపిస్తుండటం. సిరీస్‌లో మరణించినట్లు చూపించిన ఈ పాత్ర, సినిమాలో ఎలా తిరిగి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సోనాల్ చౌహాన్, జితేంద్ర కుమార్ వంటి స్టార్స్ కూడా ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మిస్తున్నారు. మూడు సీజన్ల పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై రికార్డులు సృష్టించిన మిర్జాపూర్, ఇప్పుడు థియేటర్లలో ఏ స్థాయి విధ్వంసాన్ని సృష్టిస్తుందోనని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


