ఓటీటీలోకి ‘అనగనగా ఒక రాజు’.. రాజుగారు వచ్చేది ఆ రోజేనా..?

ఓటీటీలోకి ‘అనగనగా ఒక రాజు’.. రాజుగారు వచ్చేది ఆ రోజేనా..?

Published on Feb 5, 2026 4:30 PM IST

Anaganaga Oka Raju

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’(Anaganaga Oka Raju ) డిజిటల్ ప్రీమియర్ కోసం సిద్ధమైంది. మారి దర్శకత్వంలో వచ్చిన ఈ రూరల్ డ్రామా థియేటర్లలో ప్రేక్షకులను బాగానే అలరించింది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించి, తన థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా ముగించుకుంది.

తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 13, 2026 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై మేకర్స్ లేదా నెట్‌ఫ్లిక్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఫిబ్రవరి రెండో వారంలో నవీన్ తన కామెడీ టైమింగ్‌తో ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. రావు రమేష్, తారక్ పొన్నప్ప, చమ్మక్ చంద్ర, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది.

తాజా వార్తలు