ఉత్కంఠ రేపుతున్న ‘అరణ్మనై3’ ట్రైలర్..!

ఉత్కంఠ రేపుతున్న ‘అరణ్మనై3’ ట్రైలర్..!

Published on Oct 1, 2021 2:22 AM IST


తమిళ ఇండస్టీలో హారర్ కామెడీ సినిమాలు చేయడంలో సుందర్.సి కి మంచి ప్రావీణ్యం ఉంది. ఆయన తెరకెక్కించిన అరణ్మనై’, ‘అరణ్మనై 2’ సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. తెలుగులో ‘కళావతి’, ‘చంద్రకళ’ పేర్లతో వచ్చి ఇక్కడ కూడా గాబానే కలెక్షన్లను రాబట్టాయి. అయితే సుందర్.సి ఇప్పుడు ముచ్చటగా ‘అరణ్మనై 3’ సినిమాను రూపొందించాడు.

తమిళ హీరో ఆర్య, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 14వ తేదీన విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇవి చుట్టూ. ఇది ఒక ప్యాలెస్ చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథ అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సంపత్ రాజ్, ఆండ్రియా, సాక్షి అగర్వాల్, యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు