మరో స్టార్ హీరోకి విలన్‌గా అరవింద్ స్వామి

Published on Jan 8, 2020 11:04 pm IST

ఒకప్పటి స్టార్ హీరో అరవింద్ స్వామి ఇప్పుడు ఛార్మింగ్ విలన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఏ దర్శకుడైనా డిఫరెంట్ సబ్జెక్ట్ చేయదల్చుకుంటే అరవింద్ స్వామినే ప్రతినాయకుడిగా అనుకుంటున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలకు విలన్‌గా నటించిన ఆయన మరొక స్టార్ హీరో శింబుకు కూడా ప్రతినాయకుడిగా మారుతున్నారని టాక్.

ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ పొలిటికల్ డ్రామాలో మొదట విలన్‌గా కన్నడ స్టార్ సుదీప్ చేస్తారనే టాక్ వినబడింది. కానీ ఇప్పుడు మాత్రం అరవింద్ స్వామి విలన్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది. ఇకపోతే అరవింద్ స్వామి, శింబులు గతంలో మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘చెక్క చివంత వానం’ చిత్రంలో అన్నా తమ్ముళ్ళుగా నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :