రేపు ‘అరవింద సమేత’ విజయోత్సవ సభ !

Published on Oct 20, 2018 10:46 am IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం ప్రస్తుతం బాక్సాఫిస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సినిమా పై మంచి టాక్ రావడం,, దానికి ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉండటంతో.. ప్రేక్షకుల్లో సహజంగానే సినిమా పై ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా దసరా సెలవులు కూడా రావడంతో.. ముందుగా అనుకున్నట్లుగానే ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతుంది.

ఈ సందర్భంగా ‘అరవింద సమేత’ విజయోత్సవ సభ నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 21న అనగా రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ విజయోత్సవ సభ నిర్వహించనున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఇక టెంపర్ నుండి వరుస విజయాలతో దూసుకువెళ్తున్న ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఇంకా అద్భుతంగా నటించి.. ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

సంబంధిత సమాచారం :