జయలలిత బయోపిక్ లో అరవింద స్వామి !

జయలలిత బయోపిక్ లో అరవింద స్వామి !

Published on Dec 13, 2018 9:48 AM IST

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురుచ్చితలైవి జయలలిత నిజ జీవితం ఆధారంగా ఏకంగా 3 బయోపిక్ లు తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగా ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో లేడీ డైరెక్టర్ ప్రియదర్శిని తెరకెక్కించనున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో నిత్య మీనన్ నటించనుంది. అలాగే సీనియర్ డైరెక్టర్ భారతీ రాజా కూడా అమ్మ మీద ఒక బయోపిక్ ను తెరకెక్కించనున్నాడు. ఇక వీరిద్దరి తో పాటు ఏఎల్ విజయ్ కూడా జయలలిత బయోపిక్ ను తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో జయలలిత పాత్రలో విద్యా బాలన్ నటించనుండగా ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి ని ఎంపిక చేశారని సమాచారం.

లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈచిత్రం జయలలిత జయంతి కి ఫిబ్రవరి 24 న లాంచ్ కానుంది. ఇక ఈ చిత్రం కోసం విద్యా బరువు పెరుగుతుంది. ఈచిత్రాన్ని 2020లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు