సెన్సార్ పూర్తి చేసుకున్న అరవింద సమేత !

Published on Oct 8, 2018 6:39 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం యొక్క సెన్సార్ కార్యక్రమాలు కొద్దీ సేపటి క్రితం పూర్తయ్యాయి. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు యు/ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక దాంతో అక్టోబర్ 11న భారీ స్థాయిలో విడుదలకు సిద్దమవుతుంది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా గా రానున్న ఈచిత్రానికి ఏపీ లో స్పెషల్ షోస్ వేసుకోవడానికి పర్మిషన్ లభించింది.

అక్టోబర్ 11నుండి 18వరకు ఉదయం రెండు షోస్ ఎక్కువగా వేసుకోవడానికి అక్కడి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దాంతో ఇప్పుడు అందరి చూపు ఈచిత్రం ఓపెనింగ్స్ ఫై పడ్డాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :