అరవింద సమేత ఆ రోజునే రానుంది !

అరవింద సమేత ఆ రోజునే రానుంది !

Published on Jul 17, 2018 9:30 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత ‘చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్ తరువాత చిత్ర యూనిట్ పాటల చిత్రీకరణ కోసం పొల్లాచ్చి కి వెళ్లనుంది. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్ర రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు . చిత్ర వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 11 న విడుదల కానుందట . ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు . ఇక ఈ చిత్ర టీజర్ కూడా ఆగష్టు 15 న ప్రేక్షకులముందుకు రానుందని సమాచారం.

శుభలేఖ సుధాకర్ , జగపతిబాబు , నాగబాబు లు వంటి తదితర భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం లో పూజా హెగ్డే , ఈషా రెబ్బ కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు