యూఎస్ లో జనతా గ్యారేజ్ ను దాటేసిన అరవింద సమేత !

Published on Oct 15, 2018 9:35 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ బాక్సాఫిస్ వద్ద సత్తా చాటుతుంది. ఈచిత్రం నిన్నటితో 100కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యింది. ఇక యూఎస్ ఏ లో ఈచిత్రం నిన్నటితో1.82 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి జనతా గ్యారేజ్ చిత్ర వసూళ్లను క్రాస్ చేసింది. ఇంతకుమందు ‘జనతా గ్యారేజ్’ అక్కడ 1.80మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.

ఇక ఈరోజుతో అరవింద సమేత యూఎస్ లో 2మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. హారిక హాసిని క్రియేషన్స్ ఈచిత్రాన్ని నిర్మించింది.

సంబంధిత సమాచారం :