మోహన్ లాల్ విలన్ గా సల్మాన్ ఖాన్ తమ్ముడు.

Published on May 17, 2019 3:40 pm IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ దర్శకుడు సిద్దిఖీ కంబినేషన్లో తెరకెక్కనున్న మూవీ “బిగ్ బ్రదర్”. ఈ మూవీ గురించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పడు ఇండస్ట్రీని ఊపేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడైన అర్బాజ్ ఖాన్ ఈ మూవీలో విలన్ గా చేయనున్నారంట. అర్బాజ్ హీరో మోహన్ లాల్, డైరెక్టర్ సిద్దిఖీ తో కలిసిదిగిన ఓ ఫోటో తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు.

అర్బాజ్ ఈ మూవీ గురించి ” లెజెండరీ నటులు మోహన్ లాల్ గారు , ప్రముఖ డైరెక్టర్ సిద్దిఖీ గారితో పనిచేయడం చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. మలయాళంలో నా మొదటి మూవీ. ఈ మూవీలో నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు. అర్బాజ్ ఈ మూవీలో వేదాన్త అనే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా చేయనున్నాడని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ అయిన ఈ మూవీ జులై నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీని ఈ సంవత్సరం అక్టోబర్లో విడుదల చేయాలని చుస్తున్నారంట

సంబంధిత సమాచారం :

More