అఖిల్ తో వైల్డ్ రైడ్ కి రెడీ అవ్వండి !

Published on Jul 11, 2021 12:18 pm IST

సైరా లాంటి భారీ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం ‘ఏజెంట్’ అంటూ అక్కినేని అఖిల్ తో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ స్టైలిష్ స్పై థ్రిల్లర్ నుండి ఒక వైల్డ్ పోస్టర్ వచ్చింది. పోస్టర్ లో అఖిల్ నరాలు కూడా బలంగా ఎలివేట్ అయ్యేలా కండలు తిరిగి వెనుక వైపు ఉండి మరీ వైల్డ్ గా భారీ రైడ్ కి సిద్ధం అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.

ఈ సినిమా నుండి వస్తోన్న పోస్టర్స్ తో ఈ సినిమాకి మంచి హైప్ ను క్రియేట్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో అఖిల్ రెండు వేరియేషన్స్ ఎలివేట్ అయ్యేలా రెండు లుక్స్ లో సాలిడ్ పర్శనాలిటీలో కనిపించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 24 కి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :