ఎట్టకేలకు పూర్తైన ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ !

Published on May 15, 2019 3:11 pm IST

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ రీమేక్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అనుకున్నట్టే జరిగి విడుదలకు సిద్ధమైంది. కానీ తమిళ వెర్షన్ ‘ఆదిత్య వర్మ’ మాత్రం అలా కాలేదు. మొదట బాల దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం సగానికి పైగా చిత్రీకరణ జరుపుకుని ఔట్ ఫుట్ సరిగా రాలేదనే కారణంగా ఆగిపోయింది.

దీంతో కుమారుడు ధృవ్ విక్రమ్ కెరీర్ ఇబ్బందుల్లో పడకూడదని ఆలోచించిన విక్రమ్ దర్శకుడిగా బాల స్థానంలో తెలుగు వెర్షన్ కోసం పనిచేసిన గిరీశాయను తీసుకున్నారు. కథానాయకిగా హిందీ అమ్మాయి బాణిత సంధును ఎంచుకున్నారు. ఇలా పెను మార్పుల తర్వాత ఒత్తిడి నడుమ కొత్తగా మొదలైన సినిమా ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది. ధృవ్ అండ్ టీమ్ నిర్విరామంగా 50 రోజుల పాటు షూటింగ్ చేశారు. దీంతో చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. చిత్ర యూనిట్ సైతం సినిమా బాగా వచ్చిందని అంటున్నారు.

సంబంధిత సమాచారం :

More