అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ట్రైలర్ విడుదలకు డేట్ ఫిక్స్ !

Published on May 8, 2019 3:31 pm IST

టాలీవుడ్ కల్ట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ హిందీ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ‘ఖబీర్ సింగ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కియరా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ సందీప్ రెడ్డి వంగా ఈ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇక ఈ చిత్రం నుండి ఇటీవల టీజర్ విడుదలకాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇ క ఇప్పుడు ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదలచేయనున్నారు. మే 13న ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.

టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం జూన్ 21న విడుదలకానుంది. ఇక అర్జున్ రెడ్డి ప్రస్తుతం హిందీ తో పాటు తమిళంలోనూ రీమేక్ అవుతుంది. ఆదిత్య వర్మ అనే టైటిల్ తెరకెక్కుతున్న తమిళ్ వెర్షన్ లో చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More