నూతన దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో యువ హీరో నిఖిల్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘అర్జున్ సురవరం’. మార్చి 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ టీజర్ కేవలం 24 గంటల్లోనే 2.3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.
కాగా ఈ టీజర్ ప్రేక్షకులతో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా బాగా ఆకట్టుకుంది. మెగాస్టార్ టీజర్ చాలా బాగుందని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తమ సినిమా టీజర్ ను చూసి అభిప్రాయానికి తెలియజేసిన మెగాస్టార్ కు నిఖిల్ కృతజ్ఞతలు చెప్పారు.
ఇక మార్చి 29న విడుదల అవుతున్న ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా.. కావ్య వేణుగోపాల్ మరియు రాజ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


