మళ్లీ రిలీజ్ డేట్ మార్చుకున్న ‘అర్జున్ సురవరం’ !

మళ్లీ రిలీజ్ డేట్ మార్చుకున్న ‘అర్జున్ సురవరం’ !

Published on Mar 23, 2019 1:11 PM IST

యువ హీరో నిఖిల్ హీరోగా లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా నూతన దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘అర్జున్ సురవరం’. కాగా ఈ చిత్రం మార్చి 29న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ తాజాగా ఈ చిత్రం యొక్క విడుదల తేదీ వాయిదా పడింది. మే 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఐటివలె విడుదలైన ఈ చిత్రం యొక్క మొదటి పాట ‘కన్నే కన్నే’ ప్రసుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా ‘కన్నే కన్నే’ పాటను సామ్ సి ఎస్ బాగా కంపోజ్ చేశారు. అలాగే సింగర్స్ నుండి ఆయన రాబట్టుకున్న పనితనం కూడా సాంగ్ బాగా ఇంప్రెస్స్ చెయ్యడానికి ప్రధాన కారణం. ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా.. కావ్య వేణుగోపాల్ మరియు రాజ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు