యంగ్ హీరో లేటైనా కానీ హిట్ కొట్టేలా ఉన్నాడు

Published on Nov 20, 2019 9:40 am IST

హ్యాపీ డేస్ సినిమాతో వెలుగులోకి వచ్చిన హీరో నిఖిల్ స్వామిరారా చిత్రం తరువాత హీరోగా నిరూపించుకున్నాడు. కార్తికేయ , ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాలు నిఖిల్ కి యూత్ ఇమేజ్ తెచ్చాయి. ఐతే ఆయన నటించిన లేటెస్ట్ మూవీస్ కేశవ, కిర్రాక్ పార్టీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక నిఖిల్ జర్నలిస్ట్ గా చేసిన అర్జున్ సురవరం అనేక వాయిదాలు పడుతూ వచ్చింది. మొదట్లో ముద్ర అనే టైటిల్ తో వచ్చిన ఈ చిత్రాన్ని తరువాత అర్జున్ సురవరం గా మార్చారు. ఏదిఏమైనా అనేక అవాంతరాలను అధిగమించి నిఖిల్ ఈ చిత్రాన్ని ఈనెల 29న థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా నిన్న ఈ చిత్ర థియరిటికల్ ట్రైలర్ విదుల చేశారు.

సీరియస్ కంటెంట్ తో థ్రిల్లింగ్ గా సాగిన ఈచిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఎడ్యుకేషన్ మరియు సర్టిఫికెట్స్ మాఫియాపై అర్జున్ పోరాటమే ఈచిత్రం అని తెలుస్తుంది. లేటుగా వచ్చినా అర్జున్ సురవరం చిత్రంతో నిఖిల్ మళ్ళీ ఫామ్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా టి సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బి మధు నిర్మించారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం :

More