అల్లు అర్జున్ నటిస్తోన్న ‘నా పేరు సూర్య’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒకవైపు ప్రమోషన్స్ మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదలకానుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు గాడ్ ఫాదర్ గా రావ్ రమేష్ నటిస్తుండగా ఫాదర్ గా తమిళ్ హీరో అర్జున్ యాక్ట్ చేస్తున్నాడు.
తాజా సమాచారం మేరకు యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో సైకియార్టిస్ట్ రోల్ లో కనోపించబోతున్నాడని సమాచారం. అతని పాత్ర సినిమాలో కీలకమని, అలాగే కథ ఆయన చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 14న ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చెయ్యబోతున్నారు. అను ఇమ్మానుల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను నాగబాబు లగడపాటి శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
