సాంగ్ చిత్రీకరణలో వీర రాఘవ !

Published on Sep 4, 2018 8:41 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న’అరవింద సమేత’ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు . దాంట్లో భాగంగా ఈచిత్ర షూటింగ్, డబ్బింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఏక కాలంలో పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన గుడి సెట్ లో జరుగుతుంది. ఈ సెట్లో చిత్ర బృందం ఫై ఫ్యామిలీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ చిత్తూర్ యాస లో మాట్లాడుతారట. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హాసిని హారిక క్రియేషన్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :