
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కాప్పాన్’ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు యంగ్ హీరో ఆర్య. తాజాగా ఆయన తన పాత్ర తాలూకు షూటింగ్ ను పూర్తి చేశాడు. రంగం’ ఫేమ్ కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్నఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , బోమన్ ఇరానీ , ఆర్య , చిరాగ్ జానీ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఆర్య కు కాబోయే సతీమణి సయేశా సైగల్ కథానాయికగా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య ఎన్ ఎస్ జి కమాండర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఆగస్టు లో ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు

