ఆర్య “సార్పట్ట” చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్…తెలుగులో కూడా!

Published on Jul 8, 2021 10:18 pm IST

ఆర్య సార్పట్ట పరంబారై చిత్రం విడుదల కి సిద్దం అయింది. స్పోర్ట్స్ డ్రామా గా ఈ చిత్రాన్ని పా రంజిత్ తెరకెక్కించారు. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నీలం ప్రొడక్షన్స్ మరియు K9 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో దుషర విజయం, సంచన నటరాజన్, అనుపమ కుమార్ మరియు సంతోష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం విడుదల పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని డైరక్ట్ ఓటిటి గా విడుదల చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ చిత్రాన్ని జూలై 22 వ తేదీన అమెజాన్ ప్రైమ్ విడియో లో స్ట్రీమ్ కానుంది. అయితే ఈ చిత్రం కేవలం తమిళ బాషలో మాత్రమే కాకుండా తెలుగు లో కూడా విడుదల కానుంది. అయితే ఈ చిత్రం విడుదల తేదీ పై ఒక క్లారిటీ రావడం తో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో ఆర్య బాక్సర్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :