బాక్సింగ్ నేపథ్యం లో సాగే సార్పట్ట!

Published on Jul 13, 2021 5:04 pm IST

దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం లో ఆర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సార్పట్ట. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయింది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ ట్రైలర్ అంతా కూడా బాక్సింగ్ నేపథ్యం లో కొనసాగింది. అయితే ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటి గా విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ విడియో లో ఈ చిత్రం జూలై 22 నుండి స్ట్రీమ్ కానుంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ నుండి గ్లింప్స్, ట్రైలర్ కూడా సినిమా పై భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం లో దుషర విజయన్, సంచన నటరాజన్, సంతోష్, జాన్ కొక్కెన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :