హీరోగా వి. వి. వినాయక్ – రివేంజ్ తీసుకుంటున్నాడా…?

Published on May 15, 2019 1:00 am IST

ప్రస్తుతానికి సినీ పరిశ్రమలో ఇప్పటికే కొందరు దర్శకులు సినిమాల్లో కనిపిస్తూ తమ కోరికను తీర్చుకుంటున్నారు… వారిలో చాలా వరకు దర్శకులు కొందరు నటులుగాను తమ ప్రతిభని నిరూపించుకుంటున్నారు… అందులో తమిళ దర్శకుడు సముద్రఖని ముందంజలో ఉన్నారనే చెప్పాలి… సముద్రఖని ఎలా అంటే తనకి ఇష్టమైన దర్శకత్వాన్ని వదిలేసి మరీ నటనకి ద్రుష్టి పెట్టేంతలా బిజీ అయిపోయాడు… ఇక తెలుగులో కూడా పూరి, శ్రీ‌కాంత్ అడ్డాల‌, శేఖ‌ర్ క‌మ్ముల‌లాంటి వాళ్లు అప్పుడ‌ప్పుడూ త‌మ సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో మెరుస్తుంటారు.

కానీ ఇపుడు ప్రముఖ దర్శకుడు వినాయ‌క్ హీరోగా అవతారం ఎత్తనున్నాడు… అది కూడా దిల్ రాజు బ్యానర్ లో… కాకపోతే ఇది క‌మ‌ర్షియ‌ల్ ఫార్మెట్‌లో ఉండే క‌థ కాదు. అంతేకాదు ఇందులో పాటలు, ఫైట్లు అసలే కనిపించవు… అంటే ఇది ఒక మైండ్ గేమ్ గా తెరకెక్కబోతుంది… అయితే ఈ చిత్రంలో క‌థానాయ‌కుడి పాత్ర‌కు ఎలాంటి ఇమేజీ ఉండ‌కూడ‌దు. అంతేకాకుండా కథానాయకుడి పాత్ర ఒక వృద్ధుడిలా కనిపించాలి. అందుకోసమనే ఈ చిత్రంలో కథానాయకుడిగా వినాయక్ ని తీసుకున్నారని సమాచారం… అందుకోసమని వినాయక్ బరువు తగ్గే పనిలో ఉన్నారని సమాచారం. వినాయక్ బరువు తగ్గినా తరువాతనే ఈ చిత్రం తెరకెక్కనుంది. దర్శకుడిగా ఎనలేని పేరు సంపాదించినా వినాయక్, హీరోగా ఎంత వరకు రాణిస్తాడో చూడాలి మరి…

సంబంధిత సమాచారం :

More