ఆ యంగ్ హీరోయిన్ టాలీవుడ్ న్యూ లక్కీ లేడీ

Published on Jul 11, 2019 12:53 pm IST

యుంగ్ హీరొయిన్ అషిమా నర్వాల్ ఇటీవలే “కిల్లర్” మూవీతో ఓ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హీరో విజయ్ ఆంటోనీ,అర్జున్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు,తమిళ భాషలలో హిట్ మూవీగా నిలిచింది. “కిల్లర్” మూవీ విడుదలైన వారం తరువాత మరో 60థియేటర్స్ ప్రదర్శించడం జరిగింది . అలాగే అషిమా నటించిన మరొక చిత్రం “జెస్సీ” గతంలో విడుదలై ఇలాగే విజయం సాధించడంతో పాటు, విడుదలైన వారం తరువాత అదనపు థియేటర్స్ ప్రదర్శించబడిందట.

దీనితో పరిశ్రమలో అషిమా నర్వాల్ ని గోల్డెన్ లేడి గా ఫీలవుతున్నారట. ఆమె సినిమాలో ఉంటే కచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్న నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారట. దీనితో అమ్మడుకి వరుస అవకాశాలు దక్కేఅవకాశం ఉందని ఫిలింనగర్ టాక్. మరి ఈ లక్కీ లేడీ ఎన్ని అవకాశాలు దక్కించుకోనుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

X
More