రాహుల్‌-అషూ లవ్ ట్రాక్‌లోకి ఎంటరైన ఎక్స్‌ప్రెస్ హరి..!

Published on Jul 11, 2021 2:37 am IST


డబ్‌స్మాష్‌తో జూనియర్‌ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న మోడల్‌, నటి, బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌ అషూ రెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉందని చెప్పాలి. వరుసపెట్టి ఫోటో షూట్లతో, ఫన్నీ వీడియోలతో ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ప్రస్తుతం బుల్లి తెర షోలతో బిజీగా కనిపిస్తుంది. అయితే బిగ్‌బాస్‌ సీజన్‌-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఆషూ ప్రేమాయణం కొనసాగిస్తుందని గత కొద్దిరోజులుగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ మధ్యే రాహుల్ సిప్లిగంజ్ సర్‌ప్రైజ్‌ అనౌన్స్‌మెంట్‌ అంటూ అషూను హత్తుకుని నుదిటిపై ముద్దుపెడుతున్న ఫోటోను షేర్ చేస్తూ పైగా దానికి లవ్ సింబల్ కూడా యాడ్ చేయడంతో వీరిద్దరిపై వస్తున్న లవ్ ట్రాక్ వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. అయితే వీరిద్దరు నిజంగా లవ్‌లో ఉన్నారా? లేక ఏదైనా ప్రమోషన్‌లో భాగమా? అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత అయితే ఇప్పటివరకు రాలేదు.

ఇదిలా ఉండగానే రాహుల్-ఆషూ లవ్ ట్రాక్‌లోకి కమెడీయన్ ఎక్స్‌ప్రెస్ హరి ఎంటర్ అయ్యాడు. అయితే స్టార్ మాలో వచ్చే “కామెడీ స్టార్స్” ప్రోగ్రాంలో ఎక్స్‌ప్రెస్ హరి తాను చేసే స్కిట్స్‌లో భాగంగా అషూతో వీలైనప్పుడల్లా లవ్ ట్రాక్ నడిపిస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా వస్తున్న స్కిట్‌లో ఏకంగా ఆషూ పేరును గుండెలపై టాటూ వేయించుకుని అందరికి షాక్ ఇచ్చాడు. ఆషూ నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే.. ఎప్పటికీ నువ్వు నా గుండెలపై నిలిచిపోయేంత అంటూ తన ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేస్తూ గుండెలపై పొడిపించుకున్న టాటూను రివీల్ చేశాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఇది నిజమైన పచ్చబొట్టా? లేదా స్కిట్‌ కోసం చేశావా? అని అడగ్గా నిజంగానే వేయించుకున్నట్టు హరి చెప్పాడు. అయితే ఇలా ఎందుకు చేశావంటూ హరిని ఆషూ చెంప దెబ్బ కొట్టింది. దీంతో ఒక్కసారిగా స్టేజ్‌పై అదోరకమైన వాతావరణం కనిపించింది. అయితే ఇది కేవలం స్కిట్ వరకు మాత్రమే పరిమితమా? లేక నిజంగానే హరి ఆషూని లవ్ చేస్తున్నాడా? అనే దానిపై మనందరికి ఓ క్లారిటీ రావాలంటే ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు స్టార్ మాలో వచ్చే “కామెడీ స్టార్స్” కార్యక్రమాన్ని చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :