వర్మ చెంప చెల్లుమనిపించిన బిగ్‌బాస్ బ్యూటీ అషు..!

Published on Sep 3, 2021 1:07 am IST


సంచలన సినిమాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చెంప చెల్లుమనిపించింది బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి. ఎందుకలా చేసింది అనుకుంటున్నారు కదా.. ఏమీ లేదండి ఈ మధ వర్మ అందమైన అమ్మాయిలతో బోల్డ్ ఇంటర్వ్యూలను ప్లాన్ చేస్తున్నాడు. ఆ మధ్య అరియానాతో వర్మ చేసిన చిట్ చాట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో బిగ్‌బాస్‌ బ్యూటీ అషూ రెడ్డి ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది.

దీనికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఓ కాఫీ షాప్‌లో కాఫీ తాగుతున్న అషురెడ్డి దగ్గరకు వెళ్లిన వర్మ స్వయంగా తనకు తానే పరిచయం చేసుకున్నాడు. అయితే ఆర్జీవీ ఎవరో తనకు తెలీదనట్టు ఆషు వ్యవహరించింది. ఇంతలో నీ థైస్‌ బాగున్నాయ్‌ అని వర్మ నిస్సిగ్గుగా చెప్పడంతో కోపం తెచ్చుకున్న ఆషు వర్మ చెంప చెల్లుమనిపించింది. మరీ ఆ తర్వాత వర్మ ఎలా రియాక్ట్ అయ్యాడు, మిగతా ఇంటర్వ్యూని ఎలా ప్లాన్ చేశారు అనేది తెలియాలంటే సెప్టెంబరు 7వ తేదీ రిలీజ్ అయ్యే పూర్తి ఇంటర్వ్యూను చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :