ఆగ‌స్ట్ 9న ‘అశ్వ‌మేథం’ !

Published on Jul 26, 2019 7:05 am IST

ధృవ క‌రుణాక‌ర్ హీరోగా న‌టించిన చిత్రం `అశ్వ‌మేథం`. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సైబ‌ర్ క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి నితిన్‌.జి ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సోన్యా, శివంగి కేద్‌క‌ర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

చ‌ర‌ణ్ అర్జున్ సంగీతం అందించారు. జైపాల్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎలో క్వెన్స్ మీడియా ప్రై.లి, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ ప‌తాకాల‌పై సినిమాను ప్రియా నాయ‌ర్‌, వంద‌న యాద‌వ్‌, ఐశ్వ‌ర్య యాద‌వ్‌, రూపేశ్‌, శుభ్ మ‌ల్హోత్రా నిర్మించారు. న‌టీన‌టులు: ధృవ క‌రుణాక‌ర్‌ ప్రియ‌ద‌ర్శి, వెన్నెల‌కిశోర్‌, సుమన్‌, తదితరులు. సాంకేతిక నిపుణులు: ద‌ర్శ‌క‌త్వం: నితిన్‌.జి, నిర్మాత‌లు: ప్రియా నాయ‌ర్‌, వంద‌న యాద‌వ్‌, ఐశ్వ‌ర్య యాద‌వ్‌, రూపేశ్‌, శుభ్ మ‌ల్హోత్రా.

సంబంధిత సమాచారం :