‘అసుర’ రిలీజ్ డేట్ ఖరారు..!

‘అసుర’ రిలీజ్ డేట్ ఖరారు..!

Published on May 16, 2015 4:23 PM IST

Asura
సినిమా సినిమాకూ కొత్తదనాన్ని చూపిస్తూ వైవిధ్యభరితమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న హీరో నారా రోహిత్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అసుర’ విడుదలకు సిద్ధమైంది. కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్యామ్ ధేవభక్తుని నిర్మించారు. సాయి కార్తీక్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో మే 14న విడుదలైన విషయం తెలిసిందే.

ఫస్ట్‌లుక్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోగా, ఆడియో రిలీజ్ రోజు విడుదలైన ట్రైలర్‌తో ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సినిమాపై మంచి అంచనాలు ఉన్న నేపథ్యంలో వేసవి సెలవుల్లో సినిమాను విడుదల చేయడం కలిసొస్తుందని సినిమా యూనిట్ భావించింది. ఆ క్రమంలోనే మే 29న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నారా రోహిత్ చెప్పిన ఇంటెన్స్ డైలాగులు విపరీతంగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. మరి ‘అసుర’ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు