100కోట్ల క్లబ్ లో చేరిన అరవింద సమేత !

100కోట్ల క్లబ్ లో చేరిన అరవింద సమేత !

Published on Oct 14, 2018 6:30 PM IST


ఎన్టీఆర్- త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం విడుదలైన 3రోజుల్లోనే రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లను సాదించి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రం రూ.62కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయం వైపు దూసుకుపోతుంది.

ఇక ఈచిత్రం ఫుల్ రన్ లో తారక్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది. దసరాసెలవులు అలాగే ఇప్పట్లో పెద్ద చిత్రాల విడుదల లేనందున ఈచిత్రం మంచి వసూళ్లను సాధించనుంది. అయితే దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదలవుతున్న విశాల్ ‘పందెంకోడి 2’ అలాగే రామ్ ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాలు బాక్సాఫిస్ వద్ద అరవింద సమేత కు ఏమేర పోటీనిస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు