నాగశౌర్య సినిమాలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్

Published on Jan 29, 2020 1:06 am IST

ఈమధ్య చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ ఉండటం సహజమైపోయింది. పవన్ కు సంభందించిన డైలాగ్, సీన్, మేనరిజమ్ ఇలా ఏదో ఒకటి తమ సినిమాలో ఉండేలా చూసుకుంటున్నారు చాలామంది యువ హీరోలు. ఇప్పుడు వరి జాబితాలో నాగశౌర్య కూడా చేరారు. ఆయన కొత్త చిత్రం ‘అశ్వద్దామ’ ఈ నెల 31న విడుదలకానుంది. ఈ సినిమా ఆరంభం పవన్ నటించిన ‘గోపాల గోపాల’ చిత్రంలోని డైలాగ్స్ మీద ప్రారంభమవుతుందట. అది కూడా పవన్ వాయిస్ ఓవర్లోనే కావడం విశేషం.

ఈ చిత్రంపై నాగశౌర్య చాలా ఆశలే పెట్టుకున్నారు. దీంతో పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ కావాలని శౌర్య భావిస్తున్నాడు. టీజర్, ట్రైలర్ బాగుండటంతో ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. రమణ తేజ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన మెహ్రీన్ ప్రిజాద కథానాయకిగా నటించింది. ఈ సినిమాను నాగశౌర్య స్వయంగా తన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More