పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్ననాగశౌర్య ‘అశ్వద్ధామ’.

Published on Dec 12, 2019 1:40 am IST

యంగ్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా ప్రొడ‌క్ష‌న్ నెం 3 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అల‌రించాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాలో కాస్త ఎక్క‌వుగానే యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్న‌ట్లుగా యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు. ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ తెలుగులో మొద‌టిసారిగా నాగ‌శౌర్య సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌టం విశేషం.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 31న విడుదల కానుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.అన్యాయాన్ని ప్రశ్నించి ఎదిరించేవాడిగా నాగ శౌర్య పాత్ర ఉంటుందని సమాచారం.ఈ చిత్రం కోసం నాగ శౌర్య కంప్లీట్ మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రం తరువాత టాలీవుడ్ లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మూవీ మేజర్ పార్ట్ విశాఖలో చిత్రీకరించారు. అశ్వథామ చిత్రానికి శ్రీ చరణ్ పాకల సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More