యంగ్ హీరో ‘అశ్వథామ’ గురించి ఏమి చెప్పనున్నాడో..!

Published on Dec 10, 2019 7:15 pm IST

కెరీర్ ప్రారంభం నుండి యూత్ ఫుల్ కథలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగ శౌర్య. ఐతే నాగ శౌర్య ఎప్పటినుండో కమర్షియల్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఆ తరహా చిత్రాలు ఆయన ట్రై చేశారు. ఐతే అవి అనుకున్నంత ఫలితం ఇవ్వలేదు. కాగా అశ్వథామ సినిమాతో నాగ శౌర్య మరో మారు మాస్ హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూవీ కోసం నాగ శౌర్య కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీ కూడా డెవలప్ చేశారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా నాగ శౌర్య కాలికి గాయం కూడా అయ్యింది.

రేపు ఈ మూవీకి సంబందించిన విశేషాలను పాత్రికేయులతో పంచుకోనున్నారు. ఉదయం 11:30 నిముషాలకు గ్రాండ్ ప్రెస్ మీట్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు. మరి ఈ యంగ్ హీరో తన అశ్వథామ చిత్రం గురించి ఏమి విశేషాలు పంచుకుంటారో చూడాలి. కాగా ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ చరణ్ పాకల ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More