లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న అట్లీ !

లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న అట్లీ !

Published on Feb 8, 2026 9:00 AM IST

AA22

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కోసం అట్లీ ప్లాన్ చేస్తున్నాడట. ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ను కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాంగ్ షెడ్యూల్ లో అల్లు అర్జున్ పై యాక్షన్ సీన్స్ తో పాటు ఓ సాంగ్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కూ అట్లీ రాసిన స్క్రిప్ట్ లు అన్నింటికీ కంటే ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్నంగా ఉండబోతుందట.

మరోవైపు ఈ సినిమా పై బన్నీ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కాగా ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట.

తాజా వార్తలు