‘అత్తారిల్లు..’ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్..?

‘అత్తారిల్లు..’ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్..?

Published on Sep 29, 2014 4:58 PM IST

trivikram-srinivas
‘అత్తారింటికి దారేది’ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు సమంత, అదా శర్మలను సెలెక్ట్ చేసిన త్రివిక్రమ్ మూడో హీరోయిన్ గా ప్రణితను తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆమె అయితే పాత్రకు పూర్తి న్యాయం చేయగలదని నమ్మకం ఉందట. వరుసగా సెకండ్ హీరోయిన్ అవకాశాలు వస్తుండడంతో ప్రణిత ఎలా స్పందిస్తుందో..? అని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ వార్తపై అధికారిక సమాచారం లేదు.

ఈ సినిమాలో ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మొదట రాశి ఖన్నా పేరు కూడా వినిపించింది. అయితే, త్రివిక్రమ్ ప్రణిత వైపు మొగ్గుచూపారని సమాచారం. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సమంత, ప్రణితలు కలసి నటించారు. వీరి కాంబినేషన్ తో పాటు, ప్రణిత నటనకు మంచి మార్కులే పడ్డాయి. అందువల్ల త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మరో ప్రచారం జరుగుతుంది. తాజాగా త్రివిక్రమ్ మరోసారి ‘అత్తారిల్లు..’ సెంటిమెంట్ రిపీట్ చేస్తారో..? లేదో..? వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు