ప్రేక్షకులు ఇలాంటి సందేశాత్మక చిత్రాలే కోరుకుంటున్నారు – గోపీచంద్

Published on Jul 10, 2018 9:42 am IST

గోపీచంద్, మెహ్రీన్ జంటగా నటించిన చిత్రం ‘పంతం’ జులై 5న ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలై విజయవంతంగా నడుస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విజయోత్సవ సభ నిర్వహించింది చిత్రబృందం. కాగా ఈ చిత్ర కథానాయకుడు గోపీచంద్‌ మాట్లాడుతూ.. ‘మంచి చిత్రం చేశావని అందరూ అభినందిస్తున్నారు. ఇలాంటి మెసేజ్ ఉన్న స్క్రిప్ట్ నేను చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.

ప్రేక్షకులు కూడా సమాజానికి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు రావాలని కోరుకుంటున్నారు. నా కెరీర్‌లో ఈ పంతం సినిమా ఎప్పటికి నిలిచిపోతుంది’ అని ఆయన చెప్పారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో నిర్మాత, హీరోయిన్ మెహ్రీన్, ఈ చిత్ర కెమెరామెన్ ప్రసాద్‌ మూరెళ్ల, పాటల రచయిత భాస్కరభట్ల, మాటల రచయిత రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం :