నన్ను కాపాడేది వాళ్ళే – విశ్వక్ సేన్

Published on Aug 16, 2021 8:00 pm IST

విశ్వక్ సేన్ ‘పాగల్’ చిత్రం మొదటి వారాంతంలో మంచి కలెక్షన్లతో ముగిసింది. ముఖ్యంగా శని ఆదివారాల్లో అత్యధికంగా 6.6 కోట్లు వసూలు చేసింది అని తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌ లో టీమ్ ప్రకటించింది. ఈ సందర్బంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా విషయంలో ఎవరు సపోర్ట్ చేయలేదు. అయినా సరే మన సినిమాని మనమే ప్రమోట్ చేసుకోవాలని చాలా కష్టపడి సినిమాను రిలీజ్ చేశాము.

ఇక ప్రీ రిలీజ్ వేడుకలో మా సినిమా తప్పకుండా విజయం సాధిస్తోంది, లేదంటే పేరు మార్చుకుంటా అని చెప్పాను. కానీ ఈ సినిమా హిట్ తో నా నమ్మకం నిజమైంది, నేను పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు . నేను హీరోగా చేసిన హిట్ సినిమా ‘హిట్’ కలెక్షన్స్ కంటే పాగల్ కలక్షన్స్ 40% ఎక్కువ వచ్చాయి. నాకు, ఆడియన్స్ కి మధ్యలో ఎవరు లేరు.

ఈ సినిమాతో నాకు ప్రేక్షకులు తప్ప ఎవరూ లేరని అర్థం అయింది. నన్ను కాపాడేది వాళ్లే. నిజానికి ఏపీలో సినిమా టికెట్ రేట్స్ తక్కువగా ఉన్నా, కరోనా సమయంలో ఆక్యుపెన్సీ సగం ఉన్నా, ఆలాగే సెకండ్ షో లేకపోయినా కూడా ప్రేక్షకులు నా సినిమాకు వచ్చారు. ఇక ఈ సినిమా విషయంలో చాలా మంది నెగిటివ్ గా ప్రమోట్ చేసారు. అయినా సరే నాకు మంచి విజయాన్ని అందించారు ప్రేక్షుకులు. నన్ను ప్రేక్షకుల దగ్గరికి చేర్చింది మీడియా వారికి థాంక్స్, అలాగే నన్ను నమ్మింది మాత్రం ప్రేక్షకులే, నిజంగా వారికీ థాంక్స్ చెప్పాలి’ అన్నారు.

సంబంధిత సమాచారం :