ఆగస్ట్ 27 నుండి ‘జల్సారాయుడు’ రెగ్యులర్ షూట్.

ఆగస్ట్ 27 నుండి ‘జల్సారాయుడు’ రెగ్యులర్ షూట్.

Published on Aug 16, 2014 11:14 AM IST

Jalsa_Rayudu-(14)

శ్రీకాంత్, ఎస్తేర్ జంటగా సిహెచ్ సుధీర్ రాజు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘జల్సారాయుడు’. వెంకట రమణ మూవీస్ పతాకంపై కోలన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి బెల్లంకొండ సురేష్ క్లాప్ కొత్తగా సురేష్ కొండేటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చక్రి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

భార్యాభర్తలు, కుటుంబ బాంధవ్యాల నేపధ్యంలో తెరకెక్కిస్తున్న చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. జల్సాగా తిరిగే యువకుడి కథ. త్వరగా షూటింగ్ పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని హీరో శ్రీకాంత్ అన్నారు. ఆగస్ట్ 27 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం, డిసెంబర్ 6న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ‘భీమవరం బుల్లోడు’ తర్వాత శ్రీకాంత్ సరసన ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించడం ఆనందంగా ఉందని హీరోయిన్ ఎస్తేర్ చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు