నాగ చైతన్య సమంత కలసి నటించిన ‘ఆటోనగర్ సూర్య’ మళ్లీ వార్తల్లో నిలిచింది. అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం కొన్ని ఆర్ధిక కారణాల వల్ల వాయిదా పడింది. గతంలో ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ఒకానొక సమయంలో అన్ని సమస్యలు సర్దుకున్నాయి. చిత్రం అనుకున్న తేదికి విడుదల అవ్వుతుందన్న నమక్కంతో నిర్మాతలు ఆడియో కూడా విడుదల చేసారు.
కాని ఈ చిత్రం విడుదల కాలేదు. ఇప్పుడు ఈ చిత్రం విడుదల చేయడం కోసం మరికొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఫైనాన్శియర్ లతో చర్చలు జరిపిన నిర్మాతలు ఈ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయడానికి సిద్దం అవుతున్నారు. ఈ చిత్రం ఆర్ధిక సమస్యలని దాటుకుని విడుదల కావాల్సివుంది.
దేవ కట్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్ రుబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఆర్. ఆర్. మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది.


