ఇండియాలో మొదటి రోజు రికార్డు సృష్టించిన అవెంజర్స్ ఎండ్ గేమ్ !

Published on Apr 27, 2019 3:49 pm IST

అవెంజర్ సిరీస్ లో భాగంగా వచ్చిన చివరి చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ పాజిటివ్ రివ్యూస్ తో బాక్సాఫీస్ వద్ద కల్లెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ చిత్రం ఇండియాలో అన్ని భాషల్లో కలిపి మొదటి రోజు 53.10కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. దాంతో ఇండియా లో మొదటి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మొదటి హాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టిచింది.

అంతేకాకుండా ఇండియాలో మొదటి రోజు హైయెస్ట్ గ్రాసర్ ను రాబట్టిన చిత్రాల జాబితాలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈజాబితిలో మొదటి స్థానంలో బాహుబలి 2 రెండవ స్థానంలో 2.0 చిత్రాలు ఉన్నాయి. ఈరెండు కూడా సౌత్ సినిమాలే కావడం విశేషం. ఇక ఈ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఫుల్ రన్ లో అవతార్ రికార్డులను బ్రేక్ చేసి ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేయనుంది.

సంబంధిత సమాచారం :