బిగ్ బాస్ 4 – వీరు అవినాష్ నే పక్కన పెట్టారుగా.!

Published on Nov 28, 2020 1:00 pm IST

కేవలం ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న బిగ్ బాస్ సీజన్లో ఎవరు విన్నర్ గా నిలుస్తారు అన్నది మరింత ఉత్కంఠ రేపుతోంది. అలాగే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అంతా కూడా టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్నవారే. అయితే కాస్త లో గా ఉన్న కంటెస్టెంట్స్ లో జబర్దస్త్ ఫేమ్ అవినాష్ కూడా ఒకదాని అందరికీ తెలిసిందే. కానీ అతడు మాత్రం అనుకున్న స్థాయి పెర్ఫామెన్స్ కనబర్చడం లేదని ఆడియెన్స్ మాట.

ఇపుడు ఇదంతా బాగున్నా ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ లో అవినాష్ కు కో యాక్టర్స్ అయిన చాలా మందే తమ ప్రొఫిసెన్ పరంగా అవినాష్ గెలవాలని కోరుకుంటున్నారు కానీ తమ వ్యక్తిగతంగా మాత్రం అతన్ని పక్కన పెట్టేసారు. ఆ మధ్య నాగబాబు ధనరాజ్ లేటెస్ట్ గా బులెట్ భాస్కర్ లు మాత్రం అభిజీత్ కు సపోర్ట్ చెయ్యడం గమనార్హం.

లేటెస్ట్ గా బుల్లెట్ భాస్కర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తమ సహా కమెడియన్ గా అవినాష్ గెలవాలని కోరుకుంటున్నాని కానీ తాను అయితే అభిజీత్ కే ఓట్ చేస్తానని చెప్పేసాడు. దీనితో అవినాష్ ను వారే కాస్త పక్కన పెట్టినట్టు అయ్యింది. అవినాష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బిగ్ బాస్ లో ఫైనల్స్ వరకు కొనసాగాలి అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడేమో పరిస్థితుల్లో అననుకూలంగా ఉన్నాయి. మరి మున్ముందు ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More