మిలియన్ మార్క్ దిశగా ‘అ !’ !
Published on Feb 27, 2018 2:10 pm IST

హీరో నాని సమర్పణలో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ‘అ !’ చిత్రం యూఎస్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మొదటి రోజు నుండే కలెక్షన్లలో మంచి జోరు కనబర్చిన ఈ చిత్రం ఈ మధ్య థియేటర్లను పెంచడంతో స్టడీ కలెక్షన్స్ రాబడుతోంది. ప్రీమియర్ల ద్వారా 1.26 లక్షల డాలర్లను వసూలు చేసిన ఈ చిత్రం మొదటి మూడు రోజులకే 5.62 లక్షల డాలర్లను కొల్లగొట్టి హాఫ్ మిలియన్ మార్కును అందుకుంది

అక్కడి డిస్ట్రిబ్యూటర్ల లెక్కల ప్రకారం సినిమా ఇప్పటి వరకు 8 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుంది. ఇరాక్ ఈ వారంలో కూడా సినిమాలేవీ లేకపోవడంతో ఎక్కువ థియేటర్లలో ఈ చిత్రమే రన్ అయ్యే అవకాశముంది కాబట్టి ఫుల్ రన్ ముగిసేనాటికి మిలియన్ మార్క్ టచ్ అయ్యే అవకాశముంది. ఇక చిత్రంలో విభిన్నమైన పాత్రలు చేసిన నిత్యా మీనన్, కాజల్, రెజినా వంటి వాళ్లకు కూడ నటనకుగాను మంచి ప్రశంసలు దక్కాయి.

 
Like us on Facebook