విశాల్ సినిమా విడుదల ఆగింది !

Published on May 10, 2019 9:01 am IST


యాక్షన్ హీరో విశాల్ నటించిన ‘అయోగ్య ‘చిత్రం విడుదల చివరి నిమిషం లో వాయిదాపడింది. ఈ చిత్రం ఈరోజు విడుదలకావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదాపడిందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రమోట్ చేశారు. కానీ అనుకున్న సమయానికి థియేటర్లలోకి తీసుకురాలేకపోయారు మేకర్స్. త్వరలోనే ఈ చిత్రం యొక్క విడుదలతేది ని ప్రకటించనున్నారు. మురగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు సూపర్ హిట్ మూవీ టెంపర్ కు రీమేక్ గా తెరకెక్కింది.

ఈ చిత్రంలో విశాల్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించగా పార్థిబన్ , కేఎస్ రవి కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు. ఇక విశాల్ ప్రస్తుతం సుందర్ సి డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది.

సంబంధిత సమాచారం :

More